Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి మార్కెట్‌కు తగ్గిన సరుకు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 3:43 PM గుంటూరుGeneral
మిర్చి మార్కెట్‌కు తగ్గిన సరుకు - Udayam
గుంటూరు మిర్చి మార్కెట్‌కు బుధవారం ఏసీ సరుకు 40 వేల బస్తాలు రాగా, మంగళవారంతో పోలిస్తే 5 వేల బస్తాల రాక తగ్గింది. సరుకు తగ్గినప్పటికీ ప్రధాన రకాల ధరలు స్థిరంగానే కొనసాగాయి. సీడు రకాల ధరలు కిలో రూ.160 నుండి 380 వరకు యథాతథంగా పలికాయి. నాటు 334 రకం రూ.180–280, సూపర్‌టెన్ రకం రూ.180–290 వద్ద మారకుండా ఉన్నాయి. కాగా తేజా బెస్ట్, 341 రకం నెం.5 రకాల గరిష్ఠ ధరలు కిలోపై రూ.5 చొప్పున స్వల్పంగా పెరిగాయి.

Comments

G
Loading comments...