వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను తాము సరిచేస్తుంటే, తమపై అనవసర నిందలు వేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిట్లర్ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పలేదని, ఏ పనినైనా పట్టుదలతో సాధించాలనే ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేశారని ఆయన స్పష్టం చేశారు.
హైడ్రా (HYDRAA) పూర్తిగా చట్టపరిధిలోనే పనిచేస్తూ నోటీసులు ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. భూకబ్జాదారుల గుండెల్లో భయం పుడుతుంటే ఓర్వలేకనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని, హైడ్రా చర్యలను సామాన్య ప్రజలు హర్షిస్తున్నారని వెల్లడించారు.
Comments
Loading comments...

