Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియా అసత్య ప్రచారాలపై మండిపడ్డ అంబటి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:19 PM గుంటూరుGeneral
మీడియా అసత్య ప్రచారాలపై మండిపడ్డ అంబటి - Udayam
స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది సోమవారం డిశ్చార్జ్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు అబద్ధపు వార్తలను ప్రచారం చేశాయని మండిపడ్డారు. ప్రభుత్వ అన్యాయాలపై తన పోరాటం ఆగేది లేదని, తగ్గేదే లేదని స్పష్టం చేశారు. త్వరలోనే 'వినతి పాదయాత్ర' చేపట్టి ప్రజలందరినీ కలుసుకుంటానని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...