Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్ మానేరు నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

Follow Udayam on Google
C. Rakesh Sep 25, 2026 5:14 PM రాజన్న సిరిసిల్లGeneral
మిడ్ మానేరు నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల - Udayam
బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద గల మిడ్ మానేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను పెంచినట్లు అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పిల్ వే గేట్ల ద్వారా నీటి విడుదలను క్రమంగా 8 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ప్రకటించారు. దిగువ ప్రాంతాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రవాహాన్ని పర్యవేక్షించాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...