Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు, చిన్నారుల భద్రతపై ‘మీ సురక్ష–సహచరి’ అవగాహన

Follow Udayam on Google
G,SATHISH Sep 20, 2026 9:32 PM హైదరాబాద్General
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ బి. సుమతి, IPS నేతృత్వంలో ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మలాని కాలనీలో గణేష్ మండపం వద్ద మహిళలు, చిన్నారుల భద్రత, షీ టీమ్స్ సేవలు, డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్ నాగరాజు, SI పాల్గొన్నారు.

Comments

G
Loading comments...