వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలో ఒక మహిళ నుంచి గుర్తుతెలియని వ్యక్తి నగదు, పావులెత్తు కమ్మలు తీసుకొని పరారయ్యాడు. చింతగూడకు లింగంపల్లి సుశీల అంగడి నుండి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పెన్షన్ ఎంత వచ్చిందని అడిగి ఆమె దగ్గర ఉన్న రూ. 2000 నగదుతో పాటు పావులెత్తు కమ్మలు తీసుకొని పరారయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ విషయంలో స్థానిక పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
Comments
Loading comments...

