వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తూము గౌరబాయి (75), తూము సాయిలు (65), ఆవుల గంగాధర్ (64) ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన జీపు డ్రైవర్ దాగాం తులసిరాం (28) భైంసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.
Comments
Loading comments...

