Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడారంలో భక్తుల సందడి

Follow Udayam on Google
madhu Aug 30, 2026 6:00 PM ములుగుGeneral
మేడారంలో భక్తుల సందడి - Udayam
తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు, బెల్లం, కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం మ్యూజియం, చిలకలగట్టు, సారలమ్మ గుడి తదితర ప్రాంతాలను సందర్శించారు.

Comments

G
Loading comments...