Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో పెరుగుతున్న చలి తీవ్రత

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 11:10 AM మెదక్General
మెదక్‌లో పెరుగుతున్న చలి తీవ్రత - Udayam
మెదక్ జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఉదయం పనులకు వెళ్లేవారు చలికి వణికిపోతున్నారు. పలుచోట్ల చలిమంటలు వేసుకుని వెచ్చదనం పొందుతున్నారు. చలి నుంచి రక్షణకు వెచ్చని దుస్తులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...