Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ బ్యారేజీకి 1.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 05, 2026 1:47 PM జయ శంకర్ భూపాలపల్లి General
మేడిగడ్డ బ్యారేజీకి 1.37 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం - Udayam
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 1,37,120 క్యూసెక్కుల వరద నమోదైనట్లు ఈఈ సురేశ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో గోదావరి, ప్రాణహిత నదుల్లో వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందన్నారు. మంగళవారం నుంచి బుధవారం వరకు సుమారు 37 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...