Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనంపై నుంచి దూకి వైద్య విద్యార్థిని మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 25, 2026 8:27 AM హైదరాబాద్General
భవనంపై నుంచి దూకి వైద్య విద్యార్థిని మృతి - Udayam
మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని నాగారంలో పీజీ ఆప్తమాలజీ మొదటి సంవత్సరం విద్యార్థిని దీక్షిత (26) ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులో చదువుతున్న ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...