వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఏరియా ఆసుపత్రిలో శనివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడకు చెందిన అవనాపు కిషోర్ పాలకొండలోని పెదకాపు వీధిలో తమ బంధువుల ఇంటికి వచ్చాడు. ఆకస్మాత్తుగా తన చేతిని తానే కోసుకోవడంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి అద్దాలను ధ్వంసం చేయడంతో సూపరిటెండెంట్ ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

