Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధిరలో ఐలమ్మకు ఘన నివాళి

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 3:35 PM ఖమ్మంGeneral
మధిరలో ఐలమ్మకు ఘన నివాళి - Udayam
మధిర పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పారుపల్లి విజయ్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తలుపుల వెంకటేశ్వర్లు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఐలమ్మ పోరాడారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...