Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మబ్బులు పట్టినా కురవని వాన.. నిరాశలో గ్రామీణ జీవనం

Follow Udayam on Google
nerella Srinivas Jul 24, 2026 11:57 AM జగిత్యాలGeneral
మబ్బులు పట్టినా కురవని వాన.. నిరాశలో గ్రామీణ జీవనం - Udayam
మల్యాల మండలంలో వర్షాభావంతో ఎండలు తీవ్రమై విత్తిన విత్తనాలు, పైర్లు ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు తీర్చే దారిలేక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు పడిపోవడంతో తాగునీటి కోసం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. మేత, నీరు దొరకక పశువుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. వర్షాలు పడక రైతులు, ప్రజలు, పశుపోషకులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు.

Comments

G
Loading comments...