వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు.
గురువారం భోగాపురం మండలం రావాడ పంచాయతీ పరిధిలో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు ఆమె భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి, అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

