వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం మార్చాల ప్రాథమిక పాఠశాలలో వనమహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంఈఓ శంకర్ నాయక్ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు.
మొక్కల సంరక్షణతో భావితరాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దవచ్చన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చంద్రశేఖర్, అపాక్ చైర్మన్ అంజనమ్మ, ఉప సర్పంచ్ నిజాం, కార్యదర్శి రమేష్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

