వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఈ నెల 17 నుంచి జిల్లాలో మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో ఆపరేటర్లు, సూపరింటెండెంట్లకు శిక్షణ ఇచ్చారు.
ప్రజావాణి వ్యవస్థను మండల స్థాయికి విస్తరించినట్లు అదనపు కలెక్టర్ బి.నర్సింగ్‌రావు తెలిపారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

