వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలంలో పుట్టి ధాన్యానికి తొలిసారిగా రూ.27 వేల వరకు ధర పలుకుతోంది. మండలంలో సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి కోత దశకు చేరుకోగా, రెండు రోజులుగా కోతలు కొనసాగుతున్నాయి. 860 కిలోల పుట్టి వడ్లకు వ్యాపారులు ఈ ధర చెల్లిస్తున్నారు.
గతంలో పుట్టికి రూ.22 వేలు, రూ.23 వేలకు మించి ధర రాలేదని రైతులు తెలిపారు. తొలిసారిగా అధిక ధర లభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

