వార్తలకు తిరిగి వెళ్లండి

జి.సిగడం మండలం పున్నంలో వేదాంత సంస్థ చేపడుతున్న మాంగనీస్ ఖనిజాల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. సమస్యను తెలుసుకునేందుకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం రాత్రి గ్రామాన్ని సందర్శించి రచ్చబండ నిర్వహించారు.
అనంతరం పల్లెనిద్ర చేసిన ఎంపీ.. మైనింగ్ ఆపేందుకు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

