వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండగకు రెండు రోజుల ముందే తమ్ముడు మృతి చెందడంతో ఓ అక్క పాడెపైనే రాఖీ కట్టి కన్నీరుమున్నీరైంది. కురవికి చెందిన మోటపోతుల రమేశ్ (36) అనారోగ్యంతో మృతిచెందాడు.
అంతిమయాత్రలో తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తూ అక్క బోరున విలపించింది. ఈ హృదయవిదారక ఘటనతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. పది రోజుల క్రితమే రమేశ్ తండ్రి మృతిచెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

