Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాదాపూర్‌లో రూ.3 లక్షల ఈ-సిగరెట్లు సీజ్‌

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:35 AM హైదరాబాద్General
మాదాపూర్‌లో రూ.3 లక్షల ఈ-సిగరెట్లు సీజ్‌ - Udayam
మాదాపూర్‌లో రెండు దుకాణాలపై సైబరాబాద్‌ పోలీసులు దాడులు చేసి రూ.3 లక్షల విలువైన 150 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైటెక్‌ సిటీ, అయ్యప్ప సొసైటీలోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ-సిగరెట్లు లభించాయి. దేశంలో ఈ-సిగరెట్ల విక్రయం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. 2019 ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల నిషేధ చట్టం (PECA) కింద ఈ-సిగరెట్ల ఉత్పత్తి, విక్రయం, పంపిణీ, నిల్వ, ప్రకటనలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉంది.

Comments

G
Loading comments...