Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కండేయ స్వామి దేవాలయంలో శివార్చన

Follow Udayam on Google
p.g.murthy Sep 07, 2026 2:28 PM మంచిర్యాలGeneral
మార్కండేయ స్వామి దేవాలయంలో శివార్చన - Udayam
దండేపల్లి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయంలో శివార్చన ఘనంగా జరిగింది. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయ పురోహితులు సాంబారి శాస్త్రి ఆధ్వర్యంలో మహాలింగానికి పంచామృతాభిషేకం, మహార్చనతో పాటు ప్రత్యేక శ్రావణ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి, భక్తులు శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...