వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్గాం మండలం గోలివాడ ఎంపీయూపీఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని రితిక తండ్రి సతీశ్ ఇటీవల మృతిచెందగా పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు రూ.35,100 విరాళం సేకరించి బాధితురాలికి అండగా నిలిచారు.
సేకరించిన మొత్తాన్ని చిన్నారి పేరిట సుకన్య సమృద్ధి పథకంలో జమచేసి, ఆ వివరాల పత్రాలను మంగళవారం ఆమె తల్లి సుస్మితకు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
Comments
Loading comments...

