Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వం చాటుకున్న డీసీహెచ్ఎస్ డా.రాజశేఖర్ గౌడ్

Follow Udayam on Google
K. Venkatesh Sep 30, 2026 4:37 PM ఖమ్మంGeneral
మానవత్వం చాటుకున్న డీసీహెచ్ఎస్ డా.రాజశేఖర్ గౌడ్ - Udayam
వైద్యానికి ప్రాంతం లేదు.. మానవత్వానికి హద్దులు లేవని ఖమ్మం డీసీహెచ్ఎస్ డా.రాజశేఖర్ గౌడ్ నిరూపించారు. కలెక్టరేట్ వద్ద ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడిఉన్న మధ్య ప్రదేశ్ యువకుడు అభిషేక్ ను గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కారులోనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుడి తొడ ఎముక విరిగిన బాధితుడికి తక్షణ వైద్యం అందేలా పర్యవేక్షించారు. ఆపదలో అపరిచితుడికి బాసటగా నిలవడంతో పలువురు ఆయనను కొనియాడారు.

Comments

G
Loading comments...