వార్తలకు తిరిగి వెళ్లండి

సాగులో రసాయనిక పురుగు మందుల వినియోగాన్ని సమగ్ర సస్యరక్షణతో తగ్గించవచ్చని మానవపాడు మండల వ్యవసాయ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. టమాట, మిరప పంటల్లో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు అట్టలు ఉపయోగపడతాయన్నారు.
ఎకరానికి 20-30 అట్టలను జిగురు రాసి కట్టెలకు అమర్చడం ద్వారా క్రిమికీటకాలు వాటికి అంటుకుని చనిపోతాయని తెలిపారు. దీంతో తెగుళ్లను అరికట్టవచ్చన్నారు.
Comments
Loading comments...

