వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం బలగ ప్రభుత్వ, గిరిజన సంక్షేమ ఆశ్రమ హై స్కూల్ విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
సైకాలజిస్ట్ బుడుమూరు సూర్యరావు ఒత్తిడి, ఆందోళన నియంత్రణ, భావోద్వేగాలను ఆరోగ్యకరంగా వ్యక్తీకరించడంపై వివరించారు. అవసరమైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిపుణులను సంప్రదించాలని సూచించారు. విద్యార్థులతో డీప్ బ్రీతింగ్ వ్యాయామం చేయించారు.
Comments
Loading comments...

