Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 01, 2026 10:59 AM విజయనగరంGeneral
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి - Udayam
ఎస్.కోటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై నవీన్ పద్మ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కారణంగా యువత జీవితాలు నాశనమవుతున్నాయని తెలిపారు. మహిళలను వేధిస్తే పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...