వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామపంచాయతీ బోర్డును మళ్ళీ రాయించాలని స్థానిక ప్రజలు కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయం పై ఉన్న బోర్డు చెరిగి పోవడంతో అంద విహీనంగా మారింది. నిత్యం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల రాకపోకలతో సందడిగా ఉండే గ్రామపంచాయతీ కార్యాలయం బోర్డు కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ చొరవ తీసుకుని పంచాయతీ బోర్డును రాయించాలని స్థానిక ప్రజలు కోరారు.
Comments
Loading comments...

