లంచ్ సమయానికి కివీస్ 317/6

న్యూజిలాండ్-భారత్ తొలి టెస్టు రెండో రోజు భోజన విరామానికి కివీస్ 6 వికెట్లకు 317 పరుగులు చేసింది. 243/5తో ఆట మొదలుపెట్టిన జట్టు తొలి సెషన్‌లో 74 పరుగులు జోడించింది.
నికోల్స్ 146తో నాటౌట్‌గా ఉండగా, ఫిలిప్స్ 118 పరుగులు చేసి 94వ ఓవర్‌లో ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆరో వికెట్‌కు 216 పరుగులు జోడించారు. స్మిత్ (13) క్రీజులోకి వచ్చాడు. బుమ్రా 3, ఆకాశ్‌దీప్ 2, అన్షుల్ 1 వికెట్ తీశారు.
Comments
Loading comments...
