Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంబాడిపల్లికి మరో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
Devender Bale Sep 24, 2026 9:43 AM జగిత్యాలతెలంగాణ
లంబాడిపల్లికి మరో ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలి - Udayam
మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి మరో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామానికి చెందిన గంగవ్వ అధికారులను కోరారు. ప్రస్తుతం ఒకే బస్సు రావడంతో పెగడపల్లి, ఆరవెల్లి, దోమలకుంట, తక్కలపల్లి గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులతో రద్దీ పెరుగుతోందన్నారు దీంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని మరో బస్సును ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...