వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మండలం లక్ష్మీపూర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె దవాఖానల ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 15 పల్లె దవాఖానలు మంజూరు కాగా 12 ప్రారంభించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

