Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపూర్‌లో మద్యానికి బంద్‌

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 12, 2026 10:00 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
రామచంద్రాపూర్‌లో మద్యానికి బంద్‌ - Udayam
మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం రామచంద్రాపూర్‌లో మద్యం విక్రయాలను అరికట్టాలని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామసభ నిర్వహించి బెల్ట్‌ షాపులకు ఇకపై చోటు లేదని స్పష్టం చేశారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధించాలని నిర్ణయించారు. అక్రమ విక్రయాలపై సమాచారం అందించిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు గ్రామస్థులు ప్రకటించారు.

Comments

G
Loading comments...