వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
ఏపీలో నేడు తేలికపాటి వర్షాలు

పశ్చిమబెంగాల్, ఒడిశా పరిసరాల్లో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో శనివారం తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
విజయనగరం, మన్యం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరంలో ఈదురుగాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Comments
Loading comments...