వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లపై విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. ఇంధన సరఫరాకు ఆటంకాలు తొలగడం, దేశీయంగా ఉత్పత్తి పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారులకు తిరిగి సిలిండర్ల సరఫరాను పునరుద్ధరించింది.
గతంలో గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వాణిజ్య సరఫరాను నిలిపివేయగా.. తాజాగా ఆంక్షలు తొలగించి సాధారణ స్థాయికి చేర్చింది. అలాగే, బల్క్ ఎల్‌పీజీ సరఫరాను సైతం 50 శాతం మేర సడలించినట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
Comments
Loading comments...

