Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల్లో రహదారి కష్టాల్లో గ్రామస్థులు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 11:35 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గుంతల్లో రహదారి కష్టాల్లో గ్రామస్థులు - Udayam
సోమందేపల్లి మండలం మండ్లి పంచాయతీ రూకలపల్లి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంగలపల్లి నుంచి రూకలపల్లికి ఉన్న రెండు కిలోమీటర్ల రోడ్డుపై తారు తేలి గుంతలమయంగా మారింది. రోడ్డు పరిస్థితితో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నారని గ్రామస్థులు తెలిపారు. సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...