Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 35 సీసీ కెమెరాలు ప్రారంభం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 10:31 AM కర్నూలుGeneral
కర్నూలులో 35 సీసీ కెమెరాలు ప్రారంభం - Udayam
కర్నూలు తాలూకా బి.తాండ్రపాడు సమీపంలోని కాదంబరి టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ శుక్రవారం ప్రారంభించారు. నేరాల నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకమని తెలిపారు. ప్రతి కాలనీ, గ్రామం, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లలో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజం సాధ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...