వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపురం శివారులో అటవీ అధికారులు సోదాలు నిర్వహించగా భారీ కలప డంపు గుర్తించారు. సుమారు 25 టన్నుల సండ్ర కలప ఉన్నట్లు అంచనా వేశారు. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కలప విలువ రూ.5-10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. మొద్దులను నాలుగు ట్రాక్టర్లలో జిల్లా కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం అక్రమ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

