Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో భారీ చోరీలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 12:17 PM కడపGeneral
కడపలో భారీ చోరీలు - Udayam
కడప నగరంలోని విజయదుర్గాదేవి కాలనీలో తాళం వేసి ఉన్న ప్లాట్‌లో గుర్తు తెలియని వ్యక్తి చొరబడి వంద తులాల బంగారం, రూ.3 లక్షల నగదు చోరీ చేసి పరారయ్యాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డయ్యాయి. మరోవైపు కమలాపురం మండలం ఎర్రగుడిపాడు, వల్లూరు మండలం దుగ్గాయపల్లె గ్రామాల్లోని అమ్మవార్ల ఆలయాల్లో దుండగులు తలుపులు పగలగొట్టి కిరీటాలు, మంగళసూత్రాలు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...