వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాలతో చిత్తూరు 1 టౌన్, 2 టౌన్ పరిధిలోని లాడ్జీలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అతిథుల వివరాలు, గుర్తింపు పత్రాలు, సీసీటీవీ కెమెరాలు, లైటింగ్ సదుపాయాలను పరిశీలించారు.
మత్తు పదార్థాలు, జూదం, ఇతర అక్రమ కార్యకలాపాలకు తావివ్వొద్దని లాడ్జీ యజమానులను హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

