Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూరగాయల రైతుల కష్టాలు తీరేదెన్నడో

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 7:54 PM కామరెడ్డిGeneral
కూరగాయల రైతుల కష్టాలు తీరేదెన్నడో - Udayam
కామారెడ్డి పట్టణంలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి సుభాష్ రోడ్డు జయప్రకాష్ నారాయణ్ విగ్రహం వరకు రైతులు కూరగాయలు రోడ్లపై పెట్టుకుని విక్రయిస్తున్నారు. వర్షం కారణంగా రైతులు కూరగాయలను రోడ్లపై వదిలేసి షాపుల చూరు కింద నిలబడి దీనంగా చూస్తు ఉండిపోయారు. జనాలు కూడా రాకపోవడంతో రోడ్డుపై ఉన్న కూరగాయలు వర్షానికి తడిసిపోయాయి. కూరగాయలు విక్రయాలు జరగక రైతులు ఆందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...