వార్తలకు తిరిగి వెళ్లండి
మన్యం జిల్లా కొమరాడ మండలం దేవుకోన పంచాయతీ అంటివలస గ్రామంలో రచ్చబండ కూలి మెల్లిక గంగరాజు ఇంటిపై పడింది. గంగరాజు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.
భార్య, ఇద్దరు పిల్లలు బయట ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కొత్త ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని సీపీఎం నాయకులు కోరారు.
Comments
Loading comments...

