Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో అక్రమ పశువుల వ్యాన్ పట్టివేత

Follow Udayam on Google
Ganga Oct 04, 2026 12:56 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాం పోలీసులు అక్రమంగా తరలిస్తున్న పశువుల వ్యానును పట్టుకున్నారు. ఆదివారం ఉదయం ఒడిశా నుంచి కురుపాం మీదుగా వస్తున్న వ్యానును ఎస్సై నారాయణరావు వాహన తనిఖీల్లో భాగంగా అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుకున్న బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...