వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నుంచి అమరావతి వరకు సుగాలి ప్రీతి తల్లి పార్వతి చేపట్టనున్న వీల్‌చైర్ యాత్రకు అనుమతి లేదని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా యాత్ర, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

