వార్తలకు తిరిగి వెళ్లండి
హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఘటనతో అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

