వార్తలకు తిరిగి వెళ్లండి

కట్కూర్–బండనాగారం గ్రామాల మధ్య మట్టి రహదారి నిర్మాణం మంజూరై రోజులు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. దీంతో రహదారి గుంతలమయంగా మారి వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలు కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి రాకపోకలకు మరింత అంతరాయం ఏర్పడుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

