వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కిస్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన కస్తూరిబా బాలికల పాఠశాలకు వచ్చి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. విద్యార్థులు శ్రద్ధతో బాగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Loading comments...

