వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోట మండలం కృష్ణాపురం గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు వెళ్లే మంచినీటి సరఫరా కేంద్రం వద్ద గ్రామస్థులంతా ఆదివారం ధర్నా నిర్వహించారు.
నెల రోజుల్లో రహదారి నిర్మించకపోతే నీటి సరఫరాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

