Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలోకి సంగమేశ్వరం ఆలయం.. 8 నెలల తర్వాతే దర్శనం.

Follow Udayam on Google
anji kummari Aug 03, 2026 12:23 PM మహబూబ్‌నగర్General
కృష్ణా నదిలోకి సంగమేశ్వరం ఆలయం.. 8 నెలల తర్వాతే దర్శనం. - Udayam
సోమశిల, శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న సంగమేశ్వరం దేవాలయం మళ్లీ జలాధివాసానికి చేరువవుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు లో నీటి మట్టం 849.6 అడుగులు ఉంది. నీటి మట్టం 841 అడుగులకు చేరగానే ఆలయ గర్భగుడిలోకి నీరు ప్రవేశిస్తుంది. 867 అడుగులకు చేరితే ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. దీంతో భక్తులకు స్వామివారి దర్శనం నిలిచిపోనుండగా సుమారు 8 నెలల తర్వాత నీటి మట్టం చూసి దర్శనం లభిస్తుంది.

Comments

G
Loading comments...