వార్తలకు తిరిగి వెళ్లండి

క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) రత్న మన్మోహన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రికార్డులతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ముఖ్యంగా హైరిస్క్ గర్భాలను ముందే గుర్తించి తల్లులు, నవజాత శిశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

