Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి: రితేష్‌ రాథోడ్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 7:11 PM నిర్మల్ General
క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టాలి: రితేష్‌ రాథోడ్ - Udayam
నిర్మల్‌లో కేంద్ర నిధులతో నిర్మించిన క్రిటికల్‌ కేర్‌ సెంటర్‌ను త్వరగా ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్‌ రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రం సుమారు రూ.23.74 కోట్లతో ఈ కేంద్రాన్ని మంజూరు చేసిందన్నారు. అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌, సిబ్బందిని సమకూర్చి ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...